: చరిత్రను ఎవరూ తిరగరాయలేరు... నవ నిర్మాణ దీక్షా సందేశంలో చంద్రబాబు


చరిత్రను ఎవరూ తిరగరాయలేరని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలోని బెంజి సర్కిల్ లో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన నవ నిర్మాణ దీక్షలో భాగంగా చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ఉద్యోగులు చేపట్టిన ఉద్యమాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉద్యోగుల ఉద్యమానికి పురిటిగడ్డగా మారిన బెంజి సర్కిల్ నుంచే నవ నిర్మాణ దీక్షను చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆంద్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు చేపట్టిన దీక్ష, హైదరాబాదు ప్రత్యేక సంస్థానం భారత్ లో విలీనం తదితరాలను ప్రస్తావించిన చంద్రబాబు, చరిత్రను ఎవరూ తిరగరాయలేరని చెప్పారు. తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలన్న భావనతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైందన్నారు. తెలుగు ప్రజలు అభివృద్ధి చెందాలని దివంగత ప్రధాని ఇందిరా గాంధీ ఆకాంక్షించారన్నారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం పెంపొందింపజేసేందుకు దివంగత ఎన్టీఆర్ తన పార్టీ పేరును తెలుగుదేశం పార్టీగా నామకరణం చేశారన్నారు. అయితే గత యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిందని చంద్రబాబు ఆరోపించారు.

  • Loading...

More Telugu News