: ఏపీలో అపారమైన ఖనిజ సంపద: వెలికి తీస్తామంటున్న ఇరాన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపారమైన ఖనిజ నిల్వల సంపద ఉందని, అవకాశం ఇస్తే వాటిని వెలికి తీసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ నుంచి వచ్చిన బృందం సీఎం చంద్రబాబునాయుడిని కలిసి వివరించింది. ఇండియాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ బృందం హెడ్ అలి అక్బర్ నటేగ్ నౌరీ వివరించారు. ముఖ్యంగా పెట్రో కెమికల్స్, ఐటితో పాటు ఏపీలో విరివిగా లభించే బాక్సైట్ కు తమ దేశంలో మంచి డిమాండ్ ఉందని, సముద్ర ఇసుక విస్తారంగా లభించడం ఏపీకి వరమని ఆయన అభిప్రాయపడ్డారు. విశాఖ-కాకినాడ పెట్రోలియం కారిడార్, పెట్రోకెమికల్ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్ ప్రాజెక్టుల్లో తాము భాగస్వామ్యులం అవుతామని వివరించారు. దీనిపై బాబు సైతం సానుకూలంగా స్పందించారు. ఇరాన్ నుండి ఒక బృందాన్ని పంపించాలని ఆయన సూచించారు. వారు వచ్చి అధ్యయనం చేసిన పక్షంలో భాగస్వామ్య ప్రాజెక్టులపై ఉమ్మడిగా నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు చెప్పారు.