: చంద్రబాబు ర్యాలీ ప్రారంభం... భారీగా తరలివచ్చిన బెజవాడ వాసులు
నవ నిర్మాణ దీక్షలో భాగంగా విజయవాడ చేరుకున్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం స్టెల్లా కాలేజీ నుంచి ర్యాలీ ప్రారంభించారు. నేటి ఉదయం హైదరాబాదు నుంచి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న చంద్రబాబు, నేరుగా స్టెల్లా కాలేజీ చేరుకున్నారు. అనంతరం ఆయన భారీ జన సందోహం మధ్య ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీకి బెజవాడ వాసులు బ్రహ్మరథం పట్టారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనం చంద్రబాబుతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో ర్యాలీ కొనసాగుతున్న మార్గం జనసంద్రంగా మారింది. బెంజి సర్కిల్ దాకా ఈ ర్యాలీ సాగనుంది.