: అమరులకు కేసీఆర్ ఘన నివాళి... జోరందుకున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు


తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ కొద్దిసేపటి క్రితం అమరవీరులకు ఘన నివాళి అర్పించారు. తన అధికారిక నివాసం నుంచి నేరుగా గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్న కేసీఆర్ అమరులకు నివాళి ఘటించారు. అనంతరం అక్కడి నుంచి ఆయన నేరుగా సికింద్రాబాదు పరేడ్ గ్రౌండ్స్ కు బయలుదేరారు. ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఆయన పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఇదిలా ఉంటే, తెలంగాణవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు జోరందుకున్నాయి. కేసీఆర్ కూతురు, ఎంపీ కల్వకుంట్ల కవిత నిజామాబాదులో జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఆవిర్భావ వేడుకలు ప్రారంభమయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News