: అధికారులూ... మంత్రుల సిఫారసులనూ కాస్త పరిశీలించండి: ఏపీ సీఎం చంద్రబాబు
ఏపీలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి అధికారులపై మంత్రులు అసంతృప్తిగా ఉన్నారట. ఈ మేరకు నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలోనే పలువురు మంత్రులు అధికారుల తీరుపై సీఎం నారా చంద్రబాబునాయుడికి ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి తమ వినతులను అధికారులు ఏమాత్రం పరిశీలించడం లేదని మంత్రులు చెప్పడంతో చంద్రబాబు వెనువెంటనే స్పందించారట. మంత్రుల సిఫారసులను కూడా పరిశీలించి, వారు సూచించిన ఉద్యోగులను సరైన ప్రాంతాలకు బదిలీ చేయాలని చంద్రబాబు అక్కడికక్కడే మౌఖిక ఆదేశాలు జారీ చేశారట.