: బాబూ! ఇక సెలవు... విదేశీ పైలెట్లను ఇంటికి పంపుతున్న జెట్ ఎయిర్ వేస్


విమానయాన రంగం కష్టాల్లో ఉండడంతో సంస్థలు ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాయి. తాజాగా, జెట్ ఎయిర్ వేస్ 50 మంది విదేశీ పైలెట్ల కాంట్రాక్టు రద్దు చేసుకుంది. వారిని విధుల నుంచి తప్పిస్తున్నట్టు ప్రకటించింది. తాజా నిర్ణయంతో జెట్ ఎయిర్ వేస్ లో పనిచేస్తున్న విదేశీ పైలెట్ల సంఖ్య 88కి పడిపోయింది. సంస్థ నిబంధనల ప్రకారం, కాంట్రాక్టు ముగియకుండానే తొలగించిన పైలెట్లకు పరిహారం అందిస్తారు. జెట్ ఎయిర్ వేస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) రవిచంద్రన్ నారాయణ్ ఈ వివరాలు తెలిపారు. విదేశీ సిబ్బందికి ఖర్చు అధికమవుతున్న నేపథ్యంలో, ఆర్థిక భారం తగ్గించుకునేందుకే సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News