: కేసీఆర్ కు అండమాన్ జైలే గతి: ముద్దుకృష్ణమ


తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావుపై టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ధ్వజమెత్తారు. అప్రజాస్వామ్యక కార్యకలాపాలకు పాల్పడుతున్న కేసీఆర్ కు అండమాన్ జైలే గతి అని వ్యాఖ్యానించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారని విమర్శించారు. ప్రజలు అందించిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ తరపున ఎన్నికై, ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మంత్రి పదవి ఇచ్చి రాజకీయ వ్యభిచారానికి పాల్పడింది కేసీఆర్ కాదా? అని నిలదీశారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News