: భారతీయుడినే కోచ్ గా నియమించాలి: అజార్
భారత జట్టు మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్ టీమిండియా కోచ్ ఎంపిక వ్యవహారంపై స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ... భారత్ కు చెందిన వ్యక్తినే కోచ్ గా నియమించాలని సూచించారు. కోచ్ బాధ్యతలు నిర్వర్తించగలమని భావించిన భారత మాజీ క్రికెటర్లను బీసీసీఐ ప్రోత్సహించాలని అన్నారు. భారత్ కు ప్రాతినిధ్యం వహించిన ఎందరో ఆటగాళ్లు తమ నైపుణ్యాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అజ్జూ వివరించారు. ఆటగాడిగా అనుభవం ఉన్న ప్రొఫెషనల్ కోచ్ నే ఎంచుకోవాలని స్పష్టం చేశారు.