: వార్తల్లోని వ్యక్తి 'స్టీఫెన్ సన్' ఎలా ఎమ్మెల్యే అయ్యారో తెలుసా?
స్టీఫెన్ సన్... ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు. రేవంత్ రెడ్డి ముడుపుల వ్యవహారంలో స్టీఫెన్ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. అసలు స్టీఫెన్ సన్ ఎలా ఎమ్మెల్యే అయ్యారో తెలుసా? 2014 జూన్ 2న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత... అసెంబ్లీ నిబంధనల ప్రకారం వెంటనే ఒక ఆంగ్లో ఇండియన్ ను ఎమ్మెల్యేగా నామినేట్ చేయాల్సి వచ్చింది. దీంతో, ఎవరి పేరునైనా ప్రతిపాదించమని క్రైస్తవ సంఘాల ముఖ్యనాయకులను టీఆర్ఎస్ అధిష్ఠానం కోరింది. ఈ క్రమంలో, వారు స్టీఫెన్ సన్ పేరును ప్రతిపాదించారు. ఆ తర్వాత, ఆంగ్లో ఇండియన్ కోటాలో స్టీఫెన్ ను ఎమ్మెల్యేగా నామినేట్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.