: ఇప్పీ నూడిల్స్ కూ మ్యాగీ ట్రీట్ మెంటే!


ఉత్తరప్రదేశ్ లో మ్యాగీ నూడిల్స్ అమ్మకాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఎంఎస్ జీ మోతాదు ఎక్కువగా ఉందంటూ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డీఏ) యూపీలో లక్షలాది మ్యాగీ ప్యాకెట్లను సీజ్ చేసింది. తాజాగా, ఇప్పీ నూడిల్స్ కూడా మ్యాగీ తరహా ట్రీట్ మెంట్ ఎదుర్కొంటోంది. వీటి నమూనాలను లక్నో ల్యాబ్ కు తరలించారు. ప్రస్తుతానికి ఆగ్రాలో 5 వేల ఇప్పీ నూడిల్స్ ప్యాకెట్లను సీజ్ చేశారు. ఇప్పీ నూడిల్స్ లోనూ ఎంఎస్ జీ మోతాదుకు మించి కనిపిస్తే చర్యలు తీసుకుంటామని చీఫ్ ఫుడ్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ రామ్ నరేశ్ తెలిపారు.

  • Loading...

More Telugu News