: ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత రేవంత్ కు లేదు: ఈటెల


తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలని కోరుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్ కు డబ్బు ఇవ్వబోయి అడ్డంగా బుక్కయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదని టీఎస్ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. రేవంత్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడ్డ రేవంత్ ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ తెచ్చారని విమర్శించారు. ఈ కుట్ర పన్నింది టీడీపీ అధినేత చంద్రబాబు అయితే, అమలు చేసింది రేవంత్ రెడ్డి అని చెప్పారు. డబ్బు సంచులతో ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లడం ఎన్నడూ జరగలేదని... టీడీపీ కొత్త సాంప్రదాయానికి నాంది పలికిందని అన్నారు.

  • Loading...

More Telugu News