: వీవీఎస్ లక్ష్మణ్ కు సముచిత గౌరవం... బీసీసీఐ సలహా కమిటీలో స్థానం
భారత క్రికెట్ అభ్యున్నతికి మాజీల సేవలు వినియోగించుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ క్రమంలో, బోర్డు సలహా కమిటీలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లకు స్థానం కల్పించింది. వీరి నియామకంపై బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్లో స్పందించారు. ఇకపై, ఈ ముగ్గురు సలహా కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. వారి నేతృత్వంలో భారత్ క్రికెట్ ముందుకు వెళుతుందని ట్వీట్ చేశారు. కాగా, ఈ కమిటీ ఏర్పాటు ఆలోచన బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా, ఠాకూర్ లదే. ఇకపై, క్రికెట్ కు సంబంధించిన అన్ని విషయాల్లోనూ, ముఖ్యంగా, టీమిండియా కోచ్ ను ఎంపికచేసే విషయంలో ఈ సలహా సంఘం మాటకే విలువిస్తారని అర్థమవుతోంది.