: ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ రూ. 200 కోట్లు ఖర్చు చేసింది: ఎర్రబెల్లి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఐదో అభ్యర్థిని కూడా గెలిపించుకోవడానికి టీఆర్ఎస్ ఎన్నో కుట్రలు చేసిందని... రూ. 200 కోట్లు ఖర్చు చేసిందని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సెటిట్ మెంట్లు, డబ్బులు, పదవుల కోసమే టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారని అన్నారు. వైకాపా ఎమ్మెల్యేలను కూడా టీఆర్ఎస్ కొనుగోలు చేసిందని తెలిపారు. రేవంత్ రెడ్డి ఏ తప్పూ చేయకున్నా ఇరికించారని విమర్శించారు. తెలంగాణ ద్రోహులకు కేసీఆర్ ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చారని మండిపడ్డారు. ఎంఐఎం కూడా తెలంగాణ ద్రోహుల పార్టీనే అని ఆరోపించారు.