: ఖైదీ నెంబర్ 1779... రేవంత్ కు కొత్త ఐడెంటిటీ
తెలుగుదేశం నేత, లంచం ఇవ్వజూపిన కేసులో అడ్డంగా బుక్కైపోయి చంచల్ గూడా జైలుకు వెళ్లిన రేవంత్ రెడ్డికి జైలు అధికారులు విచారణ ఖైదీ (అండర్ ట్రయల్) '1779' నెంబరును కేటాయించారు. మధ్యాహ్నం రెండున్నర గంటల తరువాత కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ పై వాదనలు ప్రారంభమై, బెయిలును నిరాకరించిన పక్షంలో రేవంత్ కు జైల్లో 'ప్రత్యేక ఖైదీ' హోదాను ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించనున్నారు. ఆయన జీవన విధానం, పుట్టి పెరిగిన పరిస్థితులు తదితరాలను వివరించి కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించాల్సిందిగా కోరితే కోర్టు అంగీకరించే అవకాశాలున్నాయి.