: రేవంత్ కు హై సెక్యూరిటీ బ్యారక్ ను కేటాయించిన చంచల్ గూడ జైలు అధికారులు


టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ కు రూ. 50 లక్షల రూపాయలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ఆరోపిస్తూ ఏసీబీ అధికారులు ఈరోజు టీటీడీపీ నేత రేవంత్ రెడ్డిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం, రేవంత్ కు అతనితో పాటు మరో ముగ్గురికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నలుగురిలో మాథ్యూస్ అనే వ్యక్తి మాత్రం పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో, రేవంత్ రెడ్డిని చంచల్ గూడ జైలులో ప్రవేశపెట్టారు. జైల్లో ఎమ్మెల్యే రేవంత్ కు హై సెక్యూరిటీ బ్యారక్ ను అధికారులు కేటాయించారు.

  • Loading...

More Telugu News