: ఆ డబ్బు కట్టలు బ్లాక్ మనీ... రేవంత్ మెడకు మరో ఉచ్చు!


తెదేపా నేత రేవంత్ రెడ్డి మెడకు మరో ఉచ్చు చిక్కుకోనుంది. ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ఇచ్చిన రూ. 50 లక్షల డబ్బు కట్టలపై ఎటువంటి బ్యాంకు సీల్ లేకపోవడమే ఇందుకు కారణం. ఈ డబ్బును నల్ల ధనంగా ఏసీబీ అధికారులు ప్రాధమికంగా భావిస్తున్నారు. ఈ డబ్బును బ్యాంకు నుంచి డ్రా చేసివున్నట్లయితే, తప్పనిసరిగా బ్యాంకు సీల్ ఉంటుంది. అలా లేకుండా చేత్తో కట్టలు కట్టినట్టుగా ఉండడంతో ఈ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారన్న విషయాన్ని రేవంత్ రెడ్డి వెల్లడించాల్సి వుంది. ఒకవేళ ఆయన సమాధానం చెప్పని పక్షంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ రంగంలోకి దిగవచ్చని సమాచారం. 'సోర్స్ ఆఫ్ ఇన్ కం' వెల్లడించని పక్షంలో అది మరో కేసుగా రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకుని తీరుతుందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News