: రేవంత్ ఉదంతంలో కీలక పాత్రధారి 'సెబాస్టియన్ హ్యారీ'... ఎవరు?
టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంలో ప్రధానంగా వినిపించిన మరో పేరు సెబాస్టియన్ హ్యారీ. డీల్ మొత్తం ఆయనే నడిపించారని ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్టులో కూడా పేర్కొన్నారు. ఈ కేసులో ఏ1 రేవంత్ రెడ్డి అయితే, ఏ2 సెబాస్టియనే. అసలు ఈ సెబాస్టియన్ హ్యారీ ఎవరనే సందేహం చాలా మందిలో కలుగుతోంది. వివరాల్లోకి వెళ్తే, సెబాస్టియన్ టీడీపీ క్రిస్టియన్ వింగ్ లీడర్. టీడీపీలోని కొంత మంది బడా లీడర్లకు సెబాస్టియన్ సన్నిహితుడు కూడా. ఈ కేసులో రేవంత్ తో పాటు సెబాస్టియన్ ను కూడా 14 రోజుల పాటు రిమాండ్ కు తరలించారు.