: చర్లపల్లి కాదు చంచల్ గూడా జైలుకు రేవంత్
ముందుగా ఊహించినట్టు రేవంత్ రెడ్డిని చర్లపల్లి జైలుకు బదులు చంచల్ గూడా జైలుకు తరలించారు. న్యాయమూర్తి మౌఖికంగా ఆదేశించిన విధంగా, ఆసుపత్రికి సైతం తరలించలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ ఉదయం 9 గంటలకు అసెంబ్లీకి ఆయన్ను తీసుకువచ్చిన సందర్భంలో, లోనికి వెళ్లి ఓటేసి వెంటనే రావాలని ఏసీబీ అధికారులు చెప్పినప్పటికీ, ఆయన సుమారు రెండున్నర గంటల పాటు అక్కడే గడిపారు. ఈ విషయం ఏసీబీ అధికారులకు అసహనాన్ని కలిగించిందని సమాచారం. రేవంత్ బయటకు రాగానే ఆసుపత్రికి తరలించకుండా, వెంటనే చంచల్ గూడా జైలుకు తరలించారు. జైలు బయట ఆయన అభిమానులు నిరసన ప్రదర్శనకు దిగగా, పోలీసులు నిలువరించి వారిని చెదరగొట్టారు.