: చంద్రబాబును అరెస్ట్ చేయండి: టీఆర్ఎస్
స్టీఫెన్ తో చర్చ సందర్భంగా రేవంత్ రెడ్డి మాటల్లో పలుసార్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తావన వచ్చిందని... అందువల్ల, వెంటనే చంద్రబాబును అరెస్ట్ చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. తన పరిమితి రెండున్నర కోట్లేనని, మిగిలిన డబ్బు బాస్ దగ్గర తీసుకోవాలని, అవసరమైతే ఏపీలో నామినేటెడ్ పదవి ఇప్పిస్తానని రేవంత్ అన్నారని... ఇందంతా చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే అని ఆరోపించారు. గతంలో కూడా డబ్బు రాజకీయాలు చేసిన చరిత్ర చంద్రబాబుదని... రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆయన డబ్బు రాజకీయాలను మానలేదని విమర్శించారు. ఈ కేసులో చంద్రబాబు కచ్చితంగా అరెస్ట్ అవుతారని... విచారణ ఎదుర్కొంటారని రాజేశ్వర్ రెడ్డి అన్నారు.