: టీవీ చానళ్లకు వీడియో ఫుటేజ్ ఎలా వెళ్లిందో నాకు తెలియదు... విచారణ జరుపుతాం: ఏసీబీ డీజీ ఏకే ఖాన్
టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ తో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న వీడియోలు అన్ని చానళ్లలో ప్రసారం అయ్యాయి. ఆ ఫుటేజ్ ఆధారంగానే రేవంత్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఈ ఉదయం కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలో రేవంత్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే, టీవీ చానళ్లకు వీడియో ఫుటేజ్ ఎలా వెళ్లిందో తనకు తెలియదని ఏసీబీ డీజీ ఏకే ఖాన్ అన్నారు. ఇది చాలా సీరియస్ విషయమని... దీనిపై విచారణ జరుపుతామని తెలిపారు.