: భలేగా ఇరికించావు బాసూ...!: స్టీఫెన్ సన్ కు తెరాస నేతల అభినందన పూర్వక ఆలింగనాలు
టీడీపీ నేత రేవంత్ రెడ్డిపై ఏసీబీకి ఫిర్యాదు చేసి ఆయన అడ్డంగా ఇరుక్కోవడానికి సహకరించిన నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఈ ఉదయం మండలి ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చిన సమయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా ఆయనకు స్వాగతం పలికి ఆలింగనం చేసుకుని లోపలికి తీసుకువెళ్లారు. పలువురు ఎమ్మెల్యేలు, తెరాస నేతలు ఆయనకు అభినందనలు తెలిపారు. రేవంత్ ను ఇరికించిన వైనాన్ని ఆయన్నుంచి అడిగి తెలుసుకుని "భలేగా ఇరికించావు బాసూ" అని అనడం వినిపించింది. ఆయన ఓటేసి బయటకు వచ్చిన తరువాత కూడా పలువురు తెరాస ఎమ్మెల్యేలు కౌగిలించుకుని ఆయన చేసిన పనిని అభినందించారు.