: కేసీఆర్ ను చంద్రబాబు మేనేజ్ చేసుకోవాలి... లేకపోతే ఆయన అరెస్ట్ తప్పదు: అంబటి
రేవంత్ రెడ్డి కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అరెస్ట్ కాకతప్పదని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు జోస్యం చెప్పారు. అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను చంద్రబాబు మేనేజ్ చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. మహానాడులో మూడు రోజుల పాటు నీతులు మాట్లాడిన టీడీపీ నేతలు, అవినీతి ఉచ్చులో ఇరుక్కున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఆదేశాలతోనే రేవంత్ రెడ్డి డబ్బు తీసుకెళ్లారని... చంద్రబాబు నిజస్వరూపం ఏమిటో ఈ కేసులో బయటపడిందని విమర్శించారు.