: ఏసీబీ కోర్టులో రేవంత్ బెయిల్ పిటిషన్


ఈ ఉదయం 10:30 గంటలకు ఏసీబీ కోర్టు ప్రారంభం కాగానే తెదేపా నేత రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. తమ క్లయింటును ఓ పథకం ప్రకారం ఇరికించారని, పలు కోణాల్లో కెమెరాలను అమర్చడం వెనుకనే వారి ఉద్దేశం, దాని వెనుక ఉన్న కుట్ర అవగతమవుతోందని బెయిల్ పిటిషన్ లో న్యాయవాదులు వెల్లడించారు. ఆయన ఎక్కడికీ పారిపోరని, ఓ ప్రజాప్రతినిధిగా, భారత చట్టాలపై ఆయనకు నమ్మకముందని, విచారణకు పూర్తిగా సహకరిస్తారని న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి లక్ష్మీపతి ఏసీబీ తరపున వాదించనున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు నోటీసులు జారీ చేసింది. బెయిలుపై విచారణను మధ్యాహ్నం చేపడతామని కోర్టు ప్రకటించింది.

  • Loading...

More Telugu News