: రూ. 600 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని వదిలి సన్యాసం స్వీకరించిన 'ప్లాస్టిక్ కింగ్' భన్వర్ లాల్
దేశ రాజధానిలో 'ప్లాస్టిక్ కింగ్' గా, జైనుల కమ్యూనిటీలో బిలియనీర్ గా పేరున్న భన్వర్ లాల్ రఘునాథ్ దోషి తన రూ. 600 కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని త్యజించి సన్యాస దీక్షను స్వీకరింరి,చారు. జైన్ ఆచార్య శ్రీ గుణరత్న సురిష్వరాజ్ జీ మహారాజ్ ఆయనకు దీక్షను అందించారు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్న భన్వర్ లాల్ 1982లోనే సన్యాసం దీక్ష స్వీకరించాలని నిర్ణయించుకున్నప్పటికీ, ఆయన వ్యాపారం, కుటుంబం అందుకు సహకరించలేదు. అహ్మదాబాద్ ఎడ్యుకేషన్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ దీక్షా స్వీకరణ కార్యక్రమానికి రూ. 100 కోట్లు ఖర్చయిందట. 1000 మందికి పైగా సాధువులు, సాధ్వీలు, లక్షన్నర మందికి పైగా జైనులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మరో 101 మంది వచ్చే ఐదేళ్లలో సన్యాసం స్వీకరిస్తామని ప్రతినబూనారు. ఈ కార్యక్రమానికి అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ హాజరై భన్వర్ లాల్ కు గౌరవ సన్మానం చేశారు. అంతకుముందు సంప్రదాయ సంగీతం మధ్య సుమారు 7 కి.మీ.ల మార్గాన భిక్షాటన చేస్తూ నడిచిన భన్వర్ లాల్ వెంట 1000 మంది జైన సన్యాసులు, 12 రథాలు, 9 ఏనుగులు, 9 ఒంటెలతో కలసి భారీ సంఖ్యలో జైన మతస్తులు ఊరేగింపుగా వచ్చారు.