: ముగ్గురు ముష్కరులను హతమార్చిన భారత సైన్యం
పాక్ ప్రేరేపిత చొరబాటుదారులు, భారత సైన్యానికి మధ్య జరుగుతున్న ఎదురు కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమైనట్టు తెలుస్తోంది. భారీగా ఆయుధ సామగ్రితో కొంతమంది తీవ్రవాదులు నిన్న ఆదివారం కశ్మీర్ లోని కుప్వారా జిల్లా, తగ్ధార్ సెక్టార్ వద్ద వాస్తవాధీన రేఖను దాటి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. వీరిని ముందుగానే గుర్తించిన భారత సైన్యం హెచ్చరికలు జారీ చేయగా, చొరబాటుదారులు ఒక్కసారిగా కాల్పులతో తెగబడ్డారు. ప్రతిగా సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు మృతి చెందారు. తీవ్రవాదులు, సైన్యం మధ్య ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.