: ప్రారంభమైన మండలి ఎన్నికలు


ఈ ఉదయం 9 గంటలకు అసెంబ్లీలో తెలంగాణ శాసన మండలి ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, ఏడుగురు అభ్యర్థులు బరిలోకి దిగడంతో ఎన్నిక అనివార్యమైంది. తెరాస తరపున కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, నేతి విద్యాసాగర్, యాదవరెడ్డి, బి వెంకటేశ్వర్లు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరపున ఆకుల లలిత, తెలుగుదేశం తరపున వేం నరేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. మొత్తం 120 మంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 4 గంటల దాకా పోలింగును జరిపి, ఆపై 5 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తామని అధికారులు వివరించారు.

  • Loading...

More Telugu News