: రూ. 63 లక్షల చెక్కు రెడీ... తీసుకోవాల్సిన ఆ మిస్టరీ మహిళ ఎక్కడ?


ఆమె పేరిట లక్ష డాలర్ల (సుమారు రూ. 63 లక్షలు) చెక్కు రెడీగా ఉంది. ఆమె కాలిఫోర్నియా పరిధిలోని మిల్పిటాస్, క్లీన్ బే ప్రాంతంలో ఉందని మాత్రమే అధికారులకు తెలుసు. ఆమెను వెతికి పట్టి ఈ చెక్కును అందిస్తామని ఆ ప్రాంత మార్కెటింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ విక్టర్ గిచున్ నమ్మకంగా అంటున్నారు. అసలు విషయం ఏంటంటే, ఓ 60 ఏళ్ల మహిళ, తన భర్త చనిపోయిన తరువాత మూలన పడివున్న సామానును రీసైక్లింగ్ నిమిత్తం ఇచ్చే సమయంలో, పాత కీబోర్డుల నడుమ పడివున్న తొలి తరం యాపిల్ కంప్యూటర్ ను కూడా ఇచ్చేసింది. ఈ యాపిల్ 1 కంప్యూటర్ ను 1976లో సంస్థ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్ స్వయంగా డిజైన్ చేశారు. అప్పట్లో కేవలం ఓ పది, పన్నెండు మాత్రమే ఈ తరహా కంప్యూటర్లు తయారయ్యాయి. ఆమె నుంచి ఈ అరుదైన కంప్యూటర్ ను 666.66 డాలర్లకు కొనుగోలు చేసిన ఓ సంస్థ దాని విలువను గమనించి వేలానికి ఉంచితే, ఓ ప్రైవేటు డాక్టర్ 2 లక్షల డాలర్లకు కొనుగోలు చేశాడు. వేలం నిర్వహించిన సంస్థ నిబంధనల ప్రకారం అందులో సగం డబ్బు ఆమెకు చెందాల్సి వుంది. ఈ నేపథ్యంలో ఆమె పేరిట ఉన్న చెక్కును ఇచ్చేందుకు బే ఏరియా అధికారులు వెతుకులాట ప్రారంభించారు.

  • Loading...

More Telugu News