: రేవంత్ కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకు అనుమతి... ఎవరితోనూ మాట్లాడవద్దన్న కండిషన్
తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి నేడు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకు ఏసీబీ న్యాయమూర్తి లక్ష్మీపతి అనుమతి ఇచ్చారు. ఎన్నికల్లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోవచ్చని, అందుకు రాజ్యాంగం అనుమతిస్తుందని ఆయన తెలిపారు. అయితే, ఓటేసే సమయంలో ఎవరితోనూ ఆయన మాట్లాడరాదన్న కండిషన్ పెట్టారు. ఆ సమయంలో స్లోగన్స్ ఇవ్వడం వంటి నిరసనలు జరగరాదని కూడా అన్నారు. ఓటేసిన అనంతరం ఆయన జ్యుడీషియల్ రిమాండ్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. కాగా, తదుపరి దర్యాప్తు నిమిత్తం రేవంత్ ను కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను వాయిదా వేశారు.