: రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

ఎమ్మెల్యేను కొనుగోలు చేయాలని చూసిన కేసులో టీడీపీ నేత రేవంత్ రెడ్డికి ఏసీబీ న్యాయమూర్తి లక్ష్మీపతి 14 రోజుల రిమాండ్ విధించారు. రేవంత్ తో పాటు కేసులో సహ నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్ సింహాలకు కూడా 14 రోజుల రిమాండు విధిస్తున్నట్టు జడ్జి వెల్లడించారు. ఆ వెంటనే రేవంత్ తరపు న్యాయవాదులు తమ క్లయింటు నేడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాల్సి వుందని, ఆయన ఓటేసేందుకు అనుమతించాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రస్తుతం వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఓటేసేందుకు న్యాయమూర్తి అనుమతించకుంటే, ఆ వెంటనే చర్లపల్లి జైలుకు రేవంత్ ను తరలించేందుకు ఏసీబీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.