: ఇండియాలో అత్యధిక లాభాలు అందించిన సంస్థగా రిలయన్స్
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఇండియాలోనే అత్యధిక లాభాలను అందించిన సంస్థగా నిలిచి ప్రభుత్వ రంగ ఓఎన్జీసీని అధిగమించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 23,566 కోట్ల నికరలాభాలను ఆర్జించగా, ఒఎన్జీసీ రూ. 18,334 కోట్లకు పరిమితమైంది. ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచిన టీసీఎస్ రూ. 19,852 కోట్ల నెట్ ప్రాఫిట్ ను గత సంవత్సరం సొంతం చేసుకుంది. అంతకుముందు 2013-14 సంవత్సరంలో ఒఎన్జీసీ నమోదు చేసిన రూ. 26,506 కోట్ల నికరలాభం సాధించగా, రిలయన్స్ రూ. 22,493 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇన్వెస్టర్లకు అత్యధిక లాభాలను అందించిన టాప్-10 జాబితాలో నాలుగో స్థానంలో రూ. 16,994 కోట్లతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిచింది. ఆపై టాటా మోటార్స్ రూ. 13,986 కోట్లతో, కోల్ ఇండియా రూ. 13,727 కోట్లతో, ఇన్ఫోసిస్ రూ. 12,329 కోట్లతో, ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 12,247 కోట్లతో, హచ్ డీఎఫ్ సీ బ్యాంక్ రూ. 10,689 కోట్లతో, ఐటీసీ రూ. 9,663 కోట్లతో కొనసాగాయి.