: ఏసీబీ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు, కార్యకర్తల ధర్నా


రేవంత్ రెడ్డిపై కుట్ర పన్ని, అన్యాయంగా కేసులో ఇరికించారని ఆరోపిస్తూ... ఏసీబీ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు, కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కేసీఆర్ లుచ్ఛా, టీఆర్ఎస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీటీడీపీ నేత ఎర్రబెల్లి మాట్లాడుతూ, తాను ఎంతో మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటికి వెళతానని... ఎన్నికల్లో మా అభ్యర్థికి ఓటు వేయాలని కోరతానని... అందులో తప్పేముందని ప్రశ్నించారు. తన ఫాం హౌస్ కు టీడీపీ ఎమ్మెల్యేలను పిలిపించుకుని, కేసీఆర్ ఏం బేరసారాలు ఆడారో చెప్పాలని డిమాండ్ చేశారు. జరుగుతున్న పరిణామాల పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, వామపక్ష పార్టీలు స్పందించాలని విన్నవించారు. రూ. 50 లక్షలు రేవంత్ ఇస్తూ పట్టుబడ్డారని ఏసీబీ అంటోందన్న వార్తలపై స్పందించిన మరో టీడీపీ నేత... ఏసీబీ అధికారులపై మండిపడ్డారు. అధికారంలో ఎవరుంటే వారికి ఏసీబీ కొమ్ము కాస్తుందని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతున్నప్పుడు ఏం ఒప్పందాలు జరిగాయన్న దానిపై ఏసీబీ ఎందుకు దృష్టి సారించలేదని నిలదీశారు.

  • Loading...

More Telugu News