: ఏసీబీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత... రేవంత్ సోదరుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు


ఏసీబీ కార్యాలయంలో టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని విచారిస్తున్నారు. రేవంత్ రెడ్డితో పాటు, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ స్టేట్ మెంట్ ను రికార్డు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంలో అక్కడకు చేరుకున్న రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి... తన సోదరుడిని చూడాలని డిమాండ్ చేశారు. అయితే కొండల్ రెడ్డిని పోలీసులు లోపలకు అనుమతించలేదు. దీంతో, తన సోదరుడిని చూసే హక్కు తనకుందని... అసలు తన సోదరుడు బతికున్నాడా? చనిపోయాడా? తెలుసుకోవాలని పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అక్కడే ఉన్న మీడియాతో మాట్లాడుతూ, రూ. 50 లక్షలు తమ వద్ద లేవని... స్నేహితుడి దగ్గరకు వెళ్లిన రేవంత్ ను అక్కడ నుంచి బలవంతంగా స్టీఫెన్ దగ్గరకు తరలించారని... అక్కడ రూ. 50 లక్షలు కూడా ప్రభుత్వమే పెట్టిందని ఆరోపించారు. ప్రభుత్వం తలచుకుంటే ఏమైనా చేస్తుందని అన్నారు. మొదట్నుంచి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తన సోదరుడిని టార్గెట్ చేశారని చెప్పారు. ఈ క్రమంలో, కొండల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆయనను పోలీసు వాహనంలో అక్కడ నుంచి తరలించారు. ఎక్కడకు తీసుకెళ్లారన్న విషయం మాత్రం తెలియలేదు.

  • Loading...

More Telugu News