: రేవంత్ పై ఎఫ్ఐఆర్ నమోదు... రేపు కోర్టులో ప్రవేశపెట్టనున్న ఏసీబీ
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదయింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ కు డబ్బు ఇస్తున్నారనే ఆరోపణలతో ఆయనపై ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయనను బంజారాహిల్స్ లోని ఏసీబీ ఆఫీసుకు తరలించారు. రేపు రేవంత్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.