: చంద్రబాబుకు ఇప్పటికీ పాదాభివందనం చేస్తా... ఈ కారణాల వల్లే టీఆర్ఎస్ లో చేరాను: మాధవరం కృష్ణారావు
రానున్న నాలుగేళ్లలో కూకట్ పల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుంటే... మరోసారి తనకు ఓటు వేయకండని టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సీమాంధ్రకు చెందిన వారికి పెన్షన్ కూడా ఇప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నానని... నియోజకవర్గ ప్రజల మేలు కోసమే టీఆర్ఎస్ లో చేరానని చెప్పారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడుకు ఇప్పటికీ పాదాభివందనం చేస్తానని అన్నారు. తెలంగాణలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా లేరని... అందుకే పార్టీ మారానని మాధవరం స్పష్టం చేశారు. తన ఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు ధర్నా చేయడాన్ని తాను తప్పుబట్టనని... పార్టీ మారానన్న ఆవేదనతోనే వారు ధర్నా చేశారని చెప్పారు.