: సొంత రాష్ట్రం వచ్చినప్పటికీ ఆంధ్ర ఉద్యోగులు ఇంకా ఇక్కడే ఉన్నారు: టీఆర్ఎస్ ఎంపీ కవిత


కమలనాథన్ కమిటీ సిఫారసుల జాప్యం వల్లే ఉద్యోగాల నోటిఫికేషన్ ఆలస్యమవుతోందని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. కమలనాథన్ కమిటీ మరింత వేగంగా పనిచేయాలని అన్నారు. సొంత రాష్ట్రం వచ్చినప్పటికీ... ఆంధ్ర ఉద్యోగులు ఇంకా తెలంగాణలోనే పనిచేస్తున్నారని విమర్శించారు. బోధన్ లో 1519 రోజుల రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న వారిని ఈరోజు కవిత సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజా సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని చెప్పారు. అందరం కలసికట్టుగా బంగారు తెలంగాణను సాధించుకుందామని అన్నారు.

  • Loading...

More Telugu News