: యువతను కేసీఆర్ మోసం చేస్తున్నారు... తెలంగాణ ద్రోహులను అందలం ఎక్కిస్తున్నారు: వీరేందర్ గౌడ్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని యువతను మోసం చేస్తున్నారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు, టీడీపీ నేత దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ ఆరోపించారు. ఇదే సమయంలో తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకుంటూ, అందలం ఎక్కిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన వారి కుటుంబాలను కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయన్న కేసీఆర్... ఇప్పుడు ఉద్యోగాల మాటే ఎత్తడం లేదని అన్నారు. ఖమ్మంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News