: గోల్కొండ రిసార్ట్స్ లో టి.కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంప్


రేపు తెలంగాణ శాసనమండలికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, రాజకీయం వేడెక్కింది. కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ కు పడిపోకుండా తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి విపక్షాలు క్యాంపులను ఏర్పాటు చేశాయి. ఈ క్రమంలో, టి.కాంగ్రెస్ హైదరాబాదులోని గోల్కొండ రిసార్ట్స్ లో క్యాంపును ఏర్పాటు చేసింది. ఈ క్యాంపుకు ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్టు సమాచారం. మరో ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు క్యాంపుకు చేరుకునే క్రమంలో మార్గమధ్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రానికి ఎమ్మెల్యేలంతా చేరుకుంటారని సమాచారం. ఈ సందర్భంగా కాంగ్రెస్ విప్ సంపత్ మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలన్న అంశంపై తమ ఎమ్మెల్యేలకు నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేశామని.. వీరిలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News