: విజయవాడలో 'కాపు' నేతలతో చర్చలు జరుపుతున్న బొత్స


మాజీ పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వైకాపాలో చేరుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడలో కాపు నేతలతో బొత్స చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంలో బొత్స మాట్లాడుతూ, జగన్ చేపట్టనున్న 'సమరదీక్ష' అనంతరం వైకాపాలో చేరుతున్నట్టు వారితో తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తనకు ఎలాంటి నష్టం జరగలేదని... ఏడాదిపాటు పోరాడినా కాంగ్రెస్ పార్టీలో ఆశించిన ఫలితం కనిపించలేదని... కేవలం తన అనుచరులు, కార్యకర్తల కోసమే తాను వైకాపాలోకి వెళుతున్నానని చెప్పారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ తప్పు లేదని... అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పార్టీని చీట్ చేశారని ఆరోపించారు. వైకాపాని సామాన్యుడి పార్టీగా తయారుచేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News