: జనవిజ్ఞాన వేదికపై హిందూ వాదుల దౌర్జన్యం
మూఢనమ్మకాలను పారద్రోలేందుకు విశేషమైన కృషి చేస్తున్న జన విజ్ఞాన వేదికపై దౌర్జన్యం జరిగింది. కడప జడ్పీ సమావేశ మందిరంలో జనవిజ్ఞాన వేదిక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో స్వామీజీల పేరిట, దేవుళ్ల పేరిట సమాజంలో చోటుచేసుకుంటున్న మోసాలపై జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు అవగాహన కల్పించేందుకు సమాయత్తమవుతుండగా, హిందూ దేవుళ్లను అవమానిస్తున్నారంటూ బీజేపీ, హిందూ సంస్థలకు చెందిన పలువురు వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. తాము దేవుడికి వ్యతిరేకం కాదని, దేవుడి పేరిట జరిగే అపచారాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. దీంతో, ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణ వరకు వెళ్లింది.