: భూసేకరణ ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం
భూసేకరణ ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. భూసేకరణ బిల్లును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఎన్డీయే సర్కారు, ఆర్డినెన్స్ ను మరోసారి జారీ చేసింది. ఇప్పటికి రెండు సార్లు ఆర్డినెన్స్ ద్వారా నెట్టుకొచ్చిన మోదీ ప్రభుత్వం ప్రతిపక్షాలు అడ్డుపడుతుండడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో, మళ్లీ ఆర్డినెన్స్ ద్వారా నెట్టుకొచ్చే ప్రయత్నం చేసింది. కాగా, భూసేకరణ బిల్లు పార్లమెంటు సంయుక్త కమిటీ పరిశీలనలో ఉంది. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ జారీ చేయాలని కేంద్ర కేబినెట్ తీర్మానించడంతో, ఆర్డినెన్స్ రాష్ట్రపతి వద్దకు పంపడంతో ఆయన ఆమోదముద్ర వేశారు.