: అలా చెప్పి నన్ను నేను మోసం చేసుకోను: రకుల్ ప్రీత్ సింగ్


ఏ రంగంలో అయినా గుర్తింపు లభిస్తే దానిని అంతా ఆస్వాదిస్తారని, తాను కూడా అంతేనని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది. సినిమాల ద్వారా వచ్చిన గుర్తింపును ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది. అయితే, పైకి మాత్రం 'పబ్లిక్ లోకి వెళ్లలేకపోతున్నాం, ఇబ్బందిగా ఉంది' అని చెప్తూ ఉంటారని, అది కరెక్ట్ అని తాను భావించడం లేదని చెప్పింది. అందరిలాగే తనను పది మందీ గుర్తుపట్టడం ఇష్టమని రకుల్ వెల్లడించింది. జీన్స్, టీషర్టులు తనను కంఫర్ట్ గా ఉంచుతాయని, భారీ మేకప్ ఇబ్బందిగా ఉంటుందని రకుల్ పేర్కొంది. లేనిపోని డాంబికాలకు పోకుండా ఉంటే సినీ రంగంలో ఎవరికీ ఇబ్బంది ఉండదని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది. కష్టపడితే విజయాలు వాటంతట అవే వస్తాయని రకుల్ ప్రీత్ తెలిపింది.

  • Loading...

More Telugu News