: మాధవరం ఇంటిని ముట్టడించిన టీడీపీ కార్యకర్తలు
మహానాడు ముగియగానే సైకిల్ దిగి, కారెక్కిన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై టీడీపీ విద్యార్థి సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబునాయుడు మద్దతుతో గెలిచి పార్టీ ఫిరాయించడంపై మండిపడిన తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) కార్యకర్తలు కూకట్ పల్లిలోని ఆయన నివాసాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా మాధవరం కృష్ణారావుకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ పరిణామాన్ని ఊహించని మాధవరం పోలీసులకు సమాచారం అందించడంతో, వారు పెద్దఎత్తున చేరుకుకున్నారు. అయితే, వారిని టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు ప్రతిఘటించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ కార్డుతో గెలిచిన మాధవరం నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాం హౌస్ లో ఆయన సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే.