: టీజర్ తో ఆకట్టుకుంటున్న 'శ్రీమంతుడు'
మహేష్ బాబు అంటే అభిమానుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మహేష్ బాబును అభిమానించని సినీ ప్రేమికుడు టాలీవుడ్ లో కనబడడంటే అతిశయోక్తి కాదు. రాకుమారుడి లాంటి లుక్, నటన, డైలాగ్ డెలివరీ ఇలా ఏదో ఒక ప్రత్యేకతతో మహేష్ బాబు అందరికీ ప్రీతిపాత్రమైపోయాడు. కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న 'శ్రీమంతుడు' అభిమానుల అంచనాలను పెంచింది. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా శ్రీమంతుడు టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ లో మహేష్ బాబును శ్రీమంతుడిగా కొరటాల శివ కొత్తగా చూపించాడు. క్లాసీ లుక్స్ తో మహేష్ బాబు మరింతమంది హృదయాలను గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.