: సెహ్వాగ్ కు బౌలింగ్ చేయడంలో మజా వుంటుంది: కపిల్ దేవ్
టీమిండియా వెటరన్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు బౌలింగ్ చేయడంలో మజా వుంటుందని భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తెలిపాడు. ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కపిల్ పలు విషయాలపై తన అభిప్రాయం వెల్లడించాడు. సెహ్వాగ్ కు బౌలింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తానని కపిల్ చెప్పాడు. గట్టి ప్రత్యర్థి ఉంటేనే బాగా ఆడగలమని చెప్పిన కపిల్, సెహ్వాగ్ చెత్త బంతిని ఎలాగూ వదలడు, మంచి బంతిని కూడా షాట్ కొట్టగల సమర్థుడని అన్నాడు. ఐదు ఓవర్లు మెయిడెన్ ఆడేవాడికి బౌలింగ్ చేసినా, చేయకున్నా ఒకటేనని, కసిగా బంతి సంధించినప్పుడు అంతకంటే కసిగా బంతిని బౌండరీ లైన్ దాటించే ఆటగాడికి బౌలింగ్ చేయడంలో ఉండే మజాయే వేరని కపిల్ వెల్లడించాడు. కోహ్లీకి క్రికెట్ లో రికార్డులు సాధించే సత్తా ఉన్నప్పటికీ అతను మెరుగవ్వాల్సిన అంశాలు ఉన్నాయని కపిల్ అభిప్రాయపడ్డాడు.