: కేసీఆర్ కు పొంగులేటి సవాల్
పారిశ్రామికవేత్తలతో కుమ్మక్కై బయ్యారం గనులపై కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకరరెడ్డి అన్నారు. దమ్ముంటే ఈ విషయంపై కేసీఆర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. బయ్యారం దగ్గర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఉక్కు ఫ్యాక్టరీపై టీఆర్ఎస్ అవగాహన లేకుండా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఖమ్మం జిల్లాలోనే ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆర్ఐఎన్ఎల్ తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. బయ్యారం నుంచి కేజీ ఇనుము కూడా విశాఖకు వెళ్లదని పొంగులేటి అన్నారు.