: స్టార్ క్రీడాకారిణికి అభిమాని పెళ్లి ప్రపోజల్


అభిమానుల తీరుతెన్నులు కొందరికి తలనొప్పి తెప్పిస్తే, మరి కొందరికి తీపి గుర్తులను మిగులుస్తాయి. డెన్మార్క్ టెన్నిస్ స్టార్ కరోలిన్ వోజ్నియాకీకి ఓ అభిమాని తీపిగుర్తును మిగిల్చాడు. పారిస్ లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ లో పాల్గొనేందుకు వచ్చిన వోజ్నియాకీకి ఓ వీరాభిమాని టెన్నిస్ కోర్టులో మోకాళ్లపై కూర్చుని ఉంగరం ఇచ్చి పెళ్లి చేసుకోవాలంటూ ప్రపోజ్ చేశాడు. అతని కోరికను వోజ్నియాకీ సున్నితంగా తిరస్కరించిందట. తన తండ్రితో అతను మాట్లాడలేదని, అందుకే అతని ప్రేమను గుండెల్లో దాచుకుంటా కానీ, అతనికి 'నో' చెప్పానని వోజ్నియాకీ వెల్లడించింది. గతంలో మెకెరాయతో ప్రేమ వ్యవహారం నడిపిన వోజ్నియాకీ ప్రస్తుతం జేజే వాట్ తో డేటింగ్ చేస్తోంది.

  • Loading...

More Telugu News