: పోలీసులపై అలీ సీరియస్


టాలీవుడ్ స్టార్ కమేడియన్ అలీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాజమండ్రిలో జరుగుతున్న నంది నాటకోత్సవాల్లో పాల్గొనేందుకు అలీ రాజమండ్రి వెళ్లాడు. వేదిక వద్దకు వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతుండగా, పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా వెళ్లడం కుదరదని తెగేసి చెప్పారు. తాను సినిమా నటుడ్నని, తనకు అనుమతి ఉందని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అలీ, వెనుదిరిగాడు. దీంతో నిర్వాహకులు కల్పించుకుని, అలీని వేదికపైకి తీసుకెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. తనలాంటి గుర్తింపు ఉన్న వ్యక్తులనే పోలీసులు ఆపేస్తే, సాధారణ కళాకారుల సంగతేంటని అలీ నిలదీశాడు. నంది నాటకోత్సవం అంటే వీఐపీ కార్యక్రమం కాదని, కళాకారుల పండుగ అని గుర్తించాలని పోలీసులకు హితవు పలికాడు. ఇలాంటి చర్యలు భవిష్యత్ కార్యక్రమాలపై ప్రభావం చూపిస్తాయని అలీ హెచ్చరించాడు.

  • Loading...

More Telugu News