: ఏపీ రాజధాని భూమి పూజ ప్రదేశంలో మైల?


తెలుగు రాష్ట్రాలు వాస్తుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఏపీ రాజధాని భూమి పూజకు ప్రభుత్వాధికారులు ఏర్పాటు చేసిన స్థలానికి మైల ఉన్నట్టు గుర్తించారు. దీంతో భూమిపూజను వేరే ప్రదేశానికి మార్చినట్టు సమాచారం. రాజధాని నిర్మాణంలో భాగంగా వచ్చే నెల 6న భూమి పూజ నిర్వహించనున్నారు. భూమి పూజకు తొలుత తుళ్లూరు మండలం మందడం, తాళ్లాయపాలెం గ్రామాల మధ్య జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ నరేంద్రబాబుకు చెందిన సర్వే నంబరు 134లో ప్రదేశాన్ని ఎంపిక చేశారు. అయితే, ఆ పొలంలో ఇటీవల ఆ కుటుంబానికి చెందిన ఓ వృద్ధురాలి అంత్యక్రియలు నిర్వహించినట్టు ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో భూమిపూజను సర్వే నంబరు 134 నుంచి సర్వే నెంబర్ 136కు అధికారులు మార్చినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News