: వారాంతాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ దోచుకునేది ఇలా!


ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నారు. ఏజెంట్ల దోపిడీని అరికట్టేందుకు ఆన్ లైన్ విధానం అందుబాటులోకి వచ్చింది. దీనిని కూడా ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు అనువుగా మార్చుకుంటున్నారు. సాధారణంగా పట్టణ ప్రాంత ప్రయాణికులు ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకుంటారు. వారాంతాల్లో వీరి ప్రయాణ రద్దీ ఎక్కువగా ఉండడాన్ని గమనించిన ప్రైవేట్ ట్రావెల్స్, ముందుగానే వారంతపు టికెట్లను బ్లాక్ చేసుకుంటున్నాయి. అనంతరం తమను ఆశ్రయించిన ప్రయాణికుల నుంచి 100 రూపాయల నుంచి 300 రూపాయల అధిక ధరకు అమ్ముకుని సొమ్ముచేసుకుంటున్నారు. దీంతో ప్రయాణికులు వారాంతాల్లో ప్రయాణాలకు వెచ్చించాల్సిన మొత్తం కంటే అధిక ధర వెచ్చిస్తూ, దోపిడీకి గురవుతున్నారు. గతంలో పండగ సమయాల్లోనే ట్రావెల్స్ ఇలా ప్రయాణికులను దోచుకునేవి. తాజాగా, వారాంతాల్లో కూడా దోపిడీకి తెరతీయడంతో ప్రయాణికులు మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News