: జపాన్ లోని మరో దీవిని వణికించిన భూకంపం


జపాన్ ను భూకంపాలు కుదిపేస్తున్నాయి. 8.5 తీవ్రతతో బొనిన్ ఐల్యాండ్స్ లో నిన్న సంభవించిన భూకంపం భారత్ సహా పలు దేశాలను వణికించిన సంగతి తెలిసిందే. ఈ భూకంపం ధాటికి టోక్యోలోని భవనాలు దాదాపు నిమిషం పాటు ఊగిసలాడాయి. ఇదే సమయంలో అమెరికాలో కూడా భూకంపం సంభవించింది. తాజాగా జపాన్ లోని ఇజు దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.4 గా నమోదైంది. భూకంపం నష్టంపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News